MLG: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు సంకల్పంతో ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని ముందుకు సాగాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.సిద్ధార్థ రెడ్డి అన్నారు. ములుగు భవిత కేంద్రంలో సమగ్ర శిక్ష, అలింకో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరానికి ఆయన హాజరయ్యారు. శిబిరానికి 90 మంది విద్యార్థులు హాజరుకాగా, 64 మందిని ఉపకరణాల కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగులు సంకల్పంతో ముందుకెళ్లాలి: డీఈవో


