KMM: ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు వృద్ధురాలిపై దంపతులు దాడి చేసిన ఘటన నేలకొండపల్లి మండలం శంకరగిరితండాలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిబాబు, షామినిలు బిచ్చు అనే వృద్ధురాలి వద్ద రూ.12 వేల అప్పు తీసుకున్నారు. బాధితురాలు ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని అడగ్గా దంపతులు దాడికి తెగబడ్డారు. దీనిపై బాధితురాలు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తెలంగాణ
అప్పు అడిగినందుకు వృద్ధురాలిపై దాడి..!


