SDPT: అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలోని సంజీవరాయిని గుట్టపై గ్రామస్తులు వరద పాశం పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ మహిళలు బతుకమ్మ ఆడుతూ ప్రకృతి దేవతను ప్రార్థించారు. యాదవ, కురమ కులస్తులు 40–50 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. బియ్యం, పాలతో నైవేద్యం సమర్పించి, గుండంలోని నీటిని పొలాలు, పశువులపై చల్లారు.
తెలంగాణ
వర్షాలు కురవాలని వరద పాశం పూజలు


