హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి'

MBNR: షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని భూత్పూర్ మండల BRS పార్టీ నాయకులు భూత్పూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావాలంటూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని SI నాగన్నకు ఫిర్యాదు చేశామన్నారు.