హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు శాంతి కమిటి సమావేశం: ఎస్సై

HNK: గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో రేపు బుధవారం ఉదయం 10 గంటలకు శాయంపేట పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.