ASF: రెబ్బెన మండలం ఎన్‌టీఆర్ నగర్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,330 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు.
తెలంగాణ
రెబ్బెనలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి


