JGL: రాయికల్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో కల్తీ ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, బిల్ బుక్‌లను పరిశీలించి, దుకాణాదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో ముక్తేశ్వర్, ఏఈవో నరేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'కల్తీ ఎరువులు అమ్మితే కఠిన చర్యలు'


