హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్గదర్శకాలకు అనుగుణంగా రి సర్వే నిర్వహించాలి'

PDPL: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా భూ రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం అంతర్గాం మండలం సోమనపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించారు. అత్యంత పారదర్శకంగా, కచ్చితంగా సర్వే నిర్వహించాలన్నారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే సర్వే చేపట్టాలన్నారు. సర్వే అనంతరం రైతులకు మ్యాప్ అందజేయాలని స్పష్టం చేశారు.