హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే శంకరయ్యపై చర్యలు తీసుకోవాలి: మాజీ MLA

WGL: మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్య చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ వరంగల్ తూర్పు మాజీ MLA నరేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై కక్షపూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోలీసులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.