SKLM: అక్షరాస్యతే సమాజ అభివృద్ధికి పునాది అని డీఈవో ఎ. రవిబాబు అన్నారు. మంగళవారం గార మండలం వమరవల్లి డైట్‌లో నిర్వహించిన 60వ అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికసిత భారత్-2047 లక్ష్యాన్ని సాధించాలంటే విద్యకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్షరంతోనే అభివృద్ధి బాట


