హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు సాగు

AKP: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల సాగు మేలని ఎలమంచిలి వ్యవసాయ అధికారి మోహన్‌రావు సూచించారు. కొత్తపాలెంలో మంగళవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 800 హెక్టార్లకు చిరుధాన్యాల విత్తనాలకు ఇండెంట్ పెట్టినట్లు తెలిపారు. వాడిపోతున్న వరి నారుమడులకు ఎరువుల ద్రావణం పిచికారీ చేయాలన్నారు.