హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

PPM: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి మంగళవారం పాలకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగావంశపు వీధి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు సకాలంలో ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.