WGL: వరంగల్ రైల్వే స్టేషన్‌లో తప్పిపోయిన బాలుడిని GRP పోలీసులు సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. బిహార్‌కు చెందిన జితేందర్ కుటుంబంతో తమిళనాడుకు వెళ్తుండగా, ఈ నెల 3న నీటి కోసం రైలు దిగిన బాలుడు తిరిగి ఎక్కలేకపోయాడు. స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న బాలుడిని పోలీసులు గుర్తించి సంరక్షించారు. తండ్రి జితేందర్ రావడంతో బాలుడిని అతడికి అప్పగించారు.
తెలంగాణ
తప్పిపోయిన బాలుడిని అప్పగించిన పోలీసులు


