హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాడేరులో కరాటే తరగతులు

ASR: గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాండు కరాటే అకాడమీ కృషి చేస్తుందని చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ బాకూరు పాండురాజు తెలిపారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మను మంగళవారం కలిసి శిక్షణ వివరాలు తెలిపారు. ఆడపిల్లల ఆత్మరక్షణ, ఆరోగ్యం, క్రమశిక్షణ, విద్య, భవిష్యత్ లక్ష్యాలపై ప్రత్యేక శిక్షణ, మోటివేషన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. కరాటేతో ధైర్యం, నాయకత్వం పెంపొందుతాయన్నారు.