PPM: పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆధ్వర్యంలో పార్వతీపురం మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. బియ్యం, పంచదార, పప్పులు, వంట నూనె తదితర ధరలు పెరగడంతో పేద, సామాన్య ప్రజలపై భారం పడుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించాలని, లేనిపక్షంలో మరిన్ని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నిత్యావసర ధరలు తగ్గించాలని నిరసన


