హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా అక్షరాస్యత దినోత్సవం

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలోని వాడవాడనా తిరుగుతూ చదువు ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.