హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ భద్రత తప్పనిసరి'

PLD: నరసరావుపేట వినాయక చవితి సందర్భంగా గణేష్‌ మండపాల్లో విద్యుత్‌ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పీ.పుల్లారెడ్డి సూచించారు. మండపాలకు తాత్కాలిక విద్యుత్‌ సరఫరా ఈ నెల26 వరకు అందిస్తామని తెలిపారు. 500 వాట్లకు రూ.1,000, 1,000 వాట్లకు రూ.2,250, దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించినట్లు వెల్లడించారు.