హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రానున్న కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ ఛైర్మన్

PPM: కాంగ్రెస్ పార్టీ ఏపీ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ జి.వి.ఎస్. కమలాకరరావు బుధవారం పార్వతీపురం మన్యం జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రైతు బజార్ సమీపంలోని పెన్షనర్స్ భవనంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం క్రీడాకారుల సమస్యలపై వినతులు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు.