హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలూరులో ప్రాథమిక సర్వే

JGL: పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన ఆలూరులో మంగళవారం ప్రాథమిక సర్వే నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా. పి. రవి, డా.కే.స్వాతి, డా.వై.స్వాతి ఆధ్వర్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి రైతుల వివరాలు సేకరించారు. మట్టి నమూనాల పరీక్ష ఫలితాలను రైతులకు వివరించారు. ఈ మేరకు వరికి ప్రత్యామ్నాయంగా ఉల్లి విత్తనాలను అందజేశారు.