హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుత్ప ఎత్తిపోతల పథకం నీటిని వెంటనే విడుదల చేయాలి'

NZB: గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్ వి. భుజంగరావుకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.