హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతులకు వ్యవసాయ అధికారి సూచనలు

ప్రకాశం: బేస్తవారిపేట (మం) పూసలపాడు, ఒందుట్ల గ్రామాల్లో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ రైతులతో గ్రామసభ నిర్వహించి, వ్యవసాయ పరిస్థితులను చర్చించారు. ఖరీఫ్‌పై ఎల్‌నినో ప్రభావం పడిందని, రాబోయే రోజుల్లో పీఎండీఎస్ విధానంలో విత్తనాలు నాటడం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుందని తెలిపారు.