కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో జరుగుతున్న రీ సర్వే పనులను సర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్ కమిషనర్ రోనంకి కుర్మనాథం మంగళవారం పరిశీలించారు. గ్రామంలో సుమారు 4,300 ఎకరాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. రైతుల సమక్షంలోనే సర్వే జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించినట్లు చెప్పారు. రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
కేసరపల్లిలో 4,300 ఎకరాల్లో రీ సర్వే పూర్తి


