హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశా వర్కర్ల అరెస్టులపై సీఐటీయూ ఖండన

NRML:హైదరాబాద్ ధర్నాకు వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఐటీయూ జిల్లా కమిటీ ఖండించింది. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి.సుజాత డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు.