హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రీసర్వేతో భూ సమస్యలకు పరిష్కారం '

KDP: రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని MRO విజయ్‌కుమార్ తెలిపారు. మంగళవారం సిద్ధవటం మండలంలోని మూలపల్లి గ్రామంలో 4వ విడత రీసర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. అక్టోబర్‌ నుంచి రీసర్వే ప్రారంభమవుతుందని, పూర్తయ్యాక బార్‌కోడ్‌తో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్వేయర్ జ్యోషిరాజు, VRO గౌస్‌బాషా, VRAలు, రైతులు పాల్గొన్నారు.