హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 గంటల విద్యుత్ ఇవ్వాలని ధర్నా

NRPT: మక్తల్ మండలం లింగంపల్లి విద్యుత్ ఉపకేంద్రం ముందు మద్వార్, లింగంపల్లి గ్రామాల రైతులు 24 గంటల నిరంతర వ్యవసాయ విద్యుత్ కోరుతూ ధర్నా నిర్వహించారు. విద్యుత్ కోతలు, తరచూ అంతరాయాల కారణంగా బోర్ల ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని రైతులు డిమాండ్ చేశారు.