హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ పట్టివేత

MDCL: ఏపీ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న రూ.1.50 కోట్ల విలువైన 12 కిలోల హషీష్ ఆయిల్‌ను ఎస్‌ఓటీ ఉప్పల్ జోన్, కుషాయిగూడ పోలీసులు పట్టుకున్నారు. నాగార్జుననగర్ కాలనీలో డ్రగ్స్‌ అప్పగించేందుకు వచ్చిన ముగ్గురు పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద 8 ప్యాకెట్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.