హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతులను అడ్డుకున్న పోలీసులు

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న ఇందిరా నగర్ కృష్ణాపూర్, కల్హేర్ గ్రామాలకు సాగునీరు అందడం లేదని కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న రైతులను టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పంటలు ఎండిపోతున్నాయని తమగోడును కలెక్టర్‌కు విన్నవించుకోకుండా అడ్డుకోవడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.