MBNR: మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని వీరన్నపేట నీలకంఠేశ్వర స్వామి దేవాలయ రథోత్సవానికి మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
రథోత్సవంలో పాల్గొన్న మేయర్


