హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయండి'

BHNG: సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో నిర్వహించే 'చలో హైదరాబాద్' మహాసభను విజయవంతం చేయాలని టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్ ధరణికోట భరత్ పిలుపునిచ్చారు. మంగళవారం తుర్కపల్లి మండలంలో ఆయన గోడపత్రికను ఆవిష్కరించారు. 2వ పీఆర్సీ అమలు, 6 డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, నగదు రహిత వైద్యం వంటి ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.