AKP: పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీడీవో చంద్రశేఖర్ సూచించారు. కోటవురట్లలో మంగళవారం శానిటేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వీధులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పొడి, తడి చెత్తను వేరు చేసి క్లాప్ మిత్రులకు అందించాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పరిశుభ్రతపై బాధ్యతగా వ్యవహరించాలి'


