హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్

GDWL: పట్టణ శివారులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం, రాగి జావ అందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్.. విద్యార్థులు క్రమం తప్పకుండా బడికి హాజరై శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.