హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో

PDPL: ధర్మారంలో మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సోమవారం ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని మండల పార్టీ అధ్యక్షుడు రూపుల నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కెసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.