హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ వ్యాఖ్యలు అహంకారపూరితం: బాణాల

WGL: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనమని దళిత కాంగ్రెస్ నేత బాణాల శ్రీనివాస్ ఖండించారు. ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.