KNR: గన్నేరువరం మండలం కాసింపేట మానస మహాక్షేత్రంలో శ్రావణ మాసం చివరి మంగళవారం సందర్భంగా మంగళవారం అమ్మవారిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి 7 గంటలకు 108 నైవేద్యాలతో మహా నివేదన కార్యక్రమం నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని అనుగ్రహం పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
మానస మహాక్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు


