హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సేవా సంకల్ప అభియాన్‌ను విజయవంతం చేయాలి'

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలో నిర్వహించే సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ పిలుపునిచ్చారు. మంగళవారం బీజేపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రధాని మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కార్యకర్తలు బాధ్యతతో పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.