హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ADB: త్రైమాసిక తనిఖీలో భాగంగా పట్టణంలోని శాంతినగర్‌లో గల ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రూ, అగ్నిమాపక అధికారి సురేష్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ, తదితరులున్నారు.