WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న(రేపు) బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీ.సాత్విక తెలిపారు. ఓ అగ్రిటెక్ సంస్థలో టెలీకాలర్ పోస్టులకు ఇంటర్వ్యూలు చేపట్టనున్నారు. ఏదైనా డిగ్రీతో 21-30 ఏళ్లలోపు మహిళలు అర్హులు. ఎంపికైన వారు వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
తెలంగాణ
రేపు మహిళలకు ఉద్యోగ జాబ్ మేళా..!


