హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతియుతంగా పండుగ జరుపుకోవాలి: SI

ADB: గణేష్ చతుర్థి వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై శ్రీసాయి అన్నారు. మంగళవారం నార్నూర్ మండలంలోని రాజులగూడలో గణేష్ ఉత్సవాలపై శాంతియుత సమావేశం నిర్వహించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ప్రతిఒక్క మండపానికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ప్రశాంతంగా పండుగ నిర్వహించాలని పేర్కొన్నారు.