హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదపు అంచుల్లో ప్రధాన రహదారి

JN: జనగామ-సిద్దిపేట మెయిన్ రోడ్డులోని మోర్ సూపర్ మార్కెట్ ఆవరణలో మ్యాన్‌హోల్ ప్రమాదకరంగా మారింది. కొన్ని రోజులుగా మ్యాన్‌హోల్ మూత లేకుండా తెరిచి ఉండటంతో వాహనదారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుంత లోతుగా ఉండటంతో ఎవరైనా ప్రమాదవశాత్తు పడితే ప్రాణాపాయం ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మూత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.