హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: ఎస్పీ

BDK: ప్రజలందరూ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో సోదరభావంతో శాంతియుత ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని మంగళవారం ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని అన్నారు.