హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నేలపై కూర్చొని తింటున్నారా..?

నేలపై కూర్చొని భోజనం చేయడం మన సంప్రదాయమే కాదు, అద్భుతమైన ఆరోగ్య రహస్యం కూడా. పద్మాసనంలో కింద కూర్చొని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. పొట్టపై ఒత్తిడి పడి ఆహారం త్వరగా అరిగి, గ్యాస్ సమస్యలు తప్పుతాయి. అంతేకాదు, చేతులతో తింటూ కిందకు వంగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, వెన్నెముక దృఢంగా మారుతుంది. ఈ చిన్న అలవాటుతో బరువు నియంత్రణలో ఉండటంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది.