హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉష్ట్రాసనం వల్ల కలిగే ఉపయోగాలు

ఉష్ట్రాసనం (ఒంటె భంగిమ) చేయడం వల్ల శరీరానికి, మెదడుకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వెన్నెముక కదలికలను మెరుగుపరుస్తుంది. వెన్నుపూసను దృఢంగా ఉంచుతుంది. కాళ్లు, తొడలు, చేతులు, భుజాలు, నడుము, మెడ కండరాలు బలోపేతమవుతాయి. నడుము కింది భాగంలో వచ్చే అసౌకర్యం, నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. ఉదర కండరాలపై ఒత్తిడి పడటం ద్వారా జీర్ణ అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి.