హైదరాబాద్: 28°C
వ్యాపారం

HDFCలో లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకు రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. పలు కాలపరిమితి రుణాలపై మాత్రమే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ని 10 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో ఆయా కాలపరిమితిల్లో తీసుకున్న రుణ గ్రహీతలకు నెలవారీ చెల్లింపులు మరింత తగ్గనున్నాయి. ఈ తగ్గింపు వెంటనే అమల్లోకి రానున్నట్లు బ్యాంకు వెల్లడించింది.