హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

MBNR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలపై దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ మరణించాలని శపించడం ఎమ్మెల్యేకు తగదని హితవు పలికారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం, ఆ ఉద్యమం లేకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేవా అని ప్రశ్నించారు. శంకర్ తన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.