HNK: ధర్మసాగర్ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొడ్డు ప్రభుదాస్, కర్ర సోమిరెడ్డి, లాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రహదారిపై బీఆర్ఎస్ ఆందోళన


