హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బోథ్‌లో విద్యుత్ సమస్య తీర్చండి'

ADB: బోథ్ పట్టణంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం NPDCL CGRF-II అధికారికి బోథ్ కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. కరెంట్ స్థంభాలు, విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో మంచినీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు.