హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

BDK: మణుగూరు ప్రధాన రహదారి భారీ వాహనాలు, లారీల రాకపోకలతో ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు వెళ్లే సమయంలో ఎగసిపడుతున్న దుమ్ము, ధూళితో వ్యాపారాలు నిర్వహించుకోలేక పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో బూడిద కలిపిన మట్టి పోయడంతో విపరీతంగా దుమ్ము వస్తుందని వాపోయారు.