ASF: చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాస ఆఖరి మంగళవారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు తూమోజు తిరుమలచార్య ఆధ్వర్యంలో అభిషేకం అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు


