హన్మకొండ కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో జూదం ఆడుతున్న ఆరుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారి నుంచి రూ.5,080 నగదు, స్కోర్ షీట్, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని, కేసు నమోదు నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించినట్లు సిఐ క్రాంతి కుమార్ తెలిపారు.
తెలంగాణ
టాస్క్ ఫోర్స్ దాడులు.. ఆరుగురిపై కేసు


