MNCL: మందమర్రి ఏరియా కాసిపేట-2 గనిపై కార్మికులు ఇవాళ ఆందోళన చేశారు. గని ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడిన సంగతి తెలిసిందే. గనిలో కార్మికులపై పనిభారం, ఒత్తిడి, రక్షణ చర్యలపై అధికారుల నిర్లక్ష్యం పై కార్మికులు ఆందోళనకు దిగారు. వందలాది కార్మికులు అధికారుల తీరుపై నిరసన తెలిపారు. గనుల్లో ఒత్తిడి తగ్గించాలని, రక్షణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
తెలంగాణ
కాసిపేట గనిలో కార్మికుల ఆందోళన


